రిజ‌ర్వేష‌న్ల‌పై పిటిష‌న్ డిస్మిస్‌…

supreme Court: బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశంపై తెలంగాణ ప్ర‌భుత్వానికి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. బీసీల‌కు బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సంబంధించిన పిటిష‌న్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనరు సూచించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల కోసం జీవో 9 జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ జీవో పై వంగ గోపాల్ రెడ్డి అనే వ్య‌క్తి సుప్రీంకోర్టు వెళ్లారు. ఈ నేప‌థ్యంలోనే పిటిష‌న్ డిస్మిస్ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. కాగా ఇదే విషయంలో ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like