ఎంపీ ఇంటి వద్ద ఉద్రిక్తత
సిసిఐ పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడిచారు. సిసిఐ పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతుల పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీగా వెళ్తున్న వారిని భారీ కేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తోచుకుంటూ వెళ్లి ఇంటి ముందు బైఠాయించారు.
గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేవారని ఇప్పుడు కేవలం ఎకరాకు 7 క్వింటాళ్ళు మాత్రమే అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ డౌన్… డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేయగా… కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేశారు.