అర్దరాత్రి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు..
Blast In Police Station: జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. పేలుడు తీవ్రతకు 300 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్టేషన్‌లో పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల భవనాలకూ పగుళ్లు వచ్చాయి.
ఇటీవల హర్యానా–జమ్మూకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఫరీదాబాద్‌లోని ఓ ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా 360 కిలోల పేలుడు పదార్థాలు నౌగామ్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అదే పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించే ప్రక్రియలోనే ఈ విస్పోటం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీమ్ నమూనాలు సేకరిస్తుండగానే పేలుడు సంభవించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. భారీ పేలుడుతో పోలీస్‌స్టేషన్ భవనం పెద్దఎత్తున ధ్వంసమైంది. వరుసగా చిన్న చిన్న పేలుళ్లు కొనసాగడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆపాల్సి వచ్చింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్‌సిబ్బంది, ప్రత్యేక దళాలు చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు.