వివాదంలో యాంక‌ర్ శివ‌జ్యోతి

Anchor Shivajyothi in controversy:రాకరాక సిరొస్తే… చింతకాయను పట్టుకుని ఏందీ వంకరటింకర కాయ అన్నదట ఎనకటికి.. అచ్చు ఇప్పుడు ఓ యాంక‌ర్ ప‌రిస్థితి అలాగే ఉంది… వంద‌లు, వేల కోట్లు ఉన్న వారు కూడా స్వామి వారి ప్ర‌సాదం దొరికితే చాలు అనుకుని… తిరుమ‌ల(Tirumala) వ‌చ్చి స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకుని ప్ర‌సాదం కోసం వేచి చూస్తారు… కానీ, మ‌ధ్య‌లో సిరి వ‌స్తే ఇదిగో ఇలా ఉంటుందంటూ సోష‌ల్ మీడియాలో చాలా మంది యాంక‌ర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు…. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే…

యాంకర్ శివజ్యోతి(Anchor Shivajyothi) తిరుమల ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డంతో పాటు ఆ పైత్యాన్ని రీల్స్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో తీవ్ర వివాదం చెల‌రేగుతోంది. తిరుమ‌ల‌లో స్వామి వారి క్యూలైన్ల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌కు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పాలు, టీ, అల్పాహారం అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల దర్శనానికి వచ్చిన యాంకర్ శివజ్యోతి స్వామి వారి ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. యాంకర్ శివజ్యోతి తన భర్త గంగూలీ, ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తిరుమలలో కంపార్ట్ మెంట్ల లో క్యూలైన్ లలో వేచిఉన్నారు. అక్కడ టీటీడీ క్యూలైన్ లలో ఉన్న భక్తులకు ప్రసాదం ఇచ్చారు. అక్కడ వారు ప్రసాదం తిన్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది…

అయితే.. తాము జీవితంలో తొలిసారి అడుక్కుని మరీ తిరుమల ప్రసాదం తిన్నామని, తిరుమలలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తిరుమల కాస్లీ ప్రసాదం అడుక్కున్నామనికూడా వేటకారంగా మాట్లాడారు. అంతేకాకుండా దీన్నంతా రీల్స్ చేసి వీడియో కూడా రికార్డు చేసుకున్నారు. ఇది వారి ఇన్ స్టా అకౌంట్ లో పోస్టు చేశారు. దీనిపై శ్రీవారి భక్తులు ,హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. టీటీడీ ఎంతో పవిత్రంగా భక్తులకు క్యూలైన్ లలో స్వామి వారి ప్రసాదం ఉచితంగా సేవా భావంతో అందిస్తుంటారని, అలాంటి ప్రసాదాన్ని తిని కాస్ట్లీ ప్రసాదం అని, కాస్ట్లీ బిచ్చగాళ్లుగా తాము అడుక్కున్నామంటూ నీచంగా మాట్లాడటంపై భక్తులు సీరియస్ అవుతున్నారు.

యాంకర్ శివజ్యోతి కొద్ది రోజుల కింద‌ట‌ ఏడు శనివారాల వ్రతం చేశారని పూజల ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఏడువారాల వ్రతం చేసి ఈ విధంగా స్వామివారి ప్రసాదంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. తిరుమలలో క్యూలైన్ లలో ఉండి, తిరుమల ప్రసాదంపైనే ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడటం ఏంటని కూడా భక్తులు సీరియస్ అవుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like