37 మంది మావోయిస్టుల లొంగుబాట

ముగ్గురు  రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సో… అలియాస్ ఎర్ర ఉన్నారు. కాగా, మిగిలిన 34 మంది మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్ చెందినవారు. వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నారు. వీరంతా తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునకు స్పందించి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఆజాద్ పై రూ. 20 లక్షలు, నారాయణపై రూ. 20 లక్షల రివార్డు ఉండగా, మొత్తం లొంగిపోయిన మావోయిస్టులందరిపై కలిపి రూ.1.41 కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ఆ మొత్తాన్ని వారికే అందజేయనున్నట్టు చెప్పారు. తెలంగాణకు చెందినవారికి పునరావాస ప్యాకేజీ కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్, పాక హనుమంతు అలియాస్ గణేశ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని చెప్పారు.

కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కామెంట్స్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో లొంగిపోయినట్లు వెల్లడించారు. పార్టీ కి చెప్పే సరెండర్ అయ్యామన్నారు. అప్పసా నారాయణ మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులు బాలేవు, భవిష్యత్తు కోసం లొంగిపోయామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like