అక్క తిక్క దిగింది…
Anchor Shivajyothi controversy:శివజ్యోతి… ఆమె ఒక యాంకర్… బిగ్ బాస్ హౌస్‌లోనూ సందడి చేసింది… పలు టీవీ షోల్లో సైతం పాల్గొంటుంది.. సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది… అయితే, ఈ మధ్య కాలంలో ఆమె వివాదాల్లో చిక్కుకుంటోంది… తాజాగా తిరుమలలో చేసిన ఓ వీడియో సైతం వివాదంగా మారింది. దీంతో శివజ్యోతిపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
శివజ్యోతి తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకుంది. క్యూ లైన్‌లో నిలబడిన సమయంలో భక్తులకు టీటీడీ అందించే ప్రసాదం తిన్నారు. అయితే.. తాము జీవితంలో తొలిసారి అడుక్కుని మరీ తిరుమల ప్రసాదం తిన్నామని, తిరుమలలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల కాస్లీ ప్రసాదం అడుక్కున్నామనికూడా వెటకారంగా మాట్లాడారు. అంతేకాకుండా దీన్నంతా రీల్స్ చేసి వీడియో కూడా రికార్డు చేసుకున్నారు. ఇది వారి ఇన్ స్టా అకౌంట్ లో పోస్టు చేశారు. దీనిపై శ్రీవారి భక్తులు ,హిందు సంఘాలు భగ్గుమన్నాయి.
దీంతో తప్పు తెలుసుకున్న శివజ్యోతి క్షమాపణలు చెబుతూ మరో వీడియో పోస్టు చేశారు. పొద్దున్నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో.. నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. వివరణ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరనా హర్ట్ అయి ఉంటే, నేను సారీ చెప్తున్నాను.. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు తెలుసు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో.. నా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి డీటెయిల్స్ చెబుతూనే ఉన్నా. వాటి గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఏదైనా సరే నా సైడ్ నుంచి తప్పు జరిగింది కాబట్టి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే, నా ఇంటెన్షన్ మాత్రం అది కాదు.
‘మేము రిచ్’ అని అన్నది.. పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు, రూ.10000 ఎల్1 క్యూ లైన్‌లో నిలబడ్డప్పుడు. కాస్ట్లీ లైన్ లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నాను.. మరో ఉద్దేశంతో కాదు. నా సైడ్ నుంచి తప్పైతే జరిగింది. నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. మా ఇద్దరి తరపున అందరికీ సారీ చెప్తున్నా.. నా ఇంట్లో వేంకటేశ్వరస్వామి ఉన్నారు. అలాగే నా చేతి మీద కూడా ఉన్నారు. అలాగే నా జీవితంలో అత్యంత విలువైన నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతాను. అసలు ఆయన గురించి తప్పుగా మాట్లాడను.. అయినా సరే నావల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని వీడియో రిలీజ్ చేసింది శివ జ్యోతి.