కోట‌ప‌ల్లిలో 230 మిలియ‌న్ ఏండ్ల నాటి శిలాజాలు

చెన్నూరు ప్రాంతంలోని కోట‌ప‌ల్లి మండ‌లం బొప్పారం అట‌వీ ప్రాంతంలో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో 230 మిలియ‌న్ ఏండ్ల నాటి శిలాజాలు ల‌భ్య‌మ‌య్యాయి. సింగ‌రేణి అన్వేష‌ణ విభాగం, తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ అన్వేష‌ణ కొన‌సాగింది. గురువారం ఈ ప్రాంతంలో శిలాజాల కోసం సంయుక్తంగా అన్వేష‌ణ చేశారు. వారి ప‌రిశోధ‌న‌లో వృక్ష, జంతువుల‌కు సంబంధించిన శిలాజాల‌ను సేక‌రించారు. ఈ శిలాజాలు అన్నీ కూడా 230 మిలియన్ సంవత్సరాల సంబంధించినవని అధికారులు వెల్ల‌డించారు.

ఇక్క‌డ సేక‌రించిన శిలాజాలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలోని సందర్శకుల నిమిత్తం ఉంచుతామ‌ని వెల్ల‌డించారు. ఈ శిలాజాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పురావస్తు శాఖ ఉపసంచాలకులు డాక్టర్ పి.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు మల్లు నాయక్ , ఎన్. సాగర్, సింగ‌రేణి అన్వేష‌ణ విభాగం డీజీఎం హనుమంత్ జియాలజిస్ట్, చెయిన్‌మెన్ దేవేందర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like