మావోయిస్టు లేఖల వీరుడి లొంగుబాటు
Big Shock To Maoist Party:మావోయిస్టు పార్టీలో లేఖల వీరుడు, ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన సహా 11 మంది మావోయిస్టులు ఆయుధాలతో మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని దారేక్ష పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వచ్చే ఏడాది జనవరి 1న తేదీన అందరం లొంగిపోతామని అనంత్ లేఖ విడుదల చేశారు. అది అటు పార్టీ వర్గాల్లో ఇటు బయట తీవ్ర సంచలనం సృష్టించింది. లేఖ విడుదల చేసిన మరుసటిరోజే ఆయన లొంగిపోవడం గమనార్హం. అనంత్ పై ఐదు రాష్ట్రాల్లో కలిపి కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇంఛార్జి, విస్తార్ మూడో ప్లటూన్ కమాండర్ సురేంద్ర ఎలియాస్ మద్వి సీమ సైతం ఉన్నారు. ఈయనపై 60 లక్షల రివార్డు ఉంది. 11 మంది మావోయిస్టుల పేరుపై మూడురాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఏకే 47, ఎస్ఎస్ఆర్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, సింగిల్ షాట్ ఆయుధాలు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను జనజీ వన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం తరపున సహకరిస్తామని చెప్పారు.