సర్పంచ్ సీటు కోసం.. తల్లీ కూతుళ్ల మధ్య పోటీ
Competition between mother and daughter for the sarpanch seat:రాజకీయాల్లో బంధుత్వాలు పనికిరావని అందరూ అంటారు… అక్షరాల అది నిజమని నిరూపిస్తున్నారు ఈ తల్లీ కూతుళ్లు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి పంచాయతీకి తల్లీకూతుళ్లు పోటీ పడుతున్నారు. మాజీ సర్పంచి శివరాత్రి రాజిరెడ్డి భార్య గంగవ్వ, వీరి కుమార్తె సుమలత ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పంచాయతీ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. గంగవ్వకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుండగా, సుమలతకు కాంగ్రెస్ సపోర్టు చేస్తోంది.
సుమలత 2017లో అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. మొన్నటి వరకు సుమలత తండ్రి రాజిరెడ్డి సర్పంచ్‌గా పనిచేశారు. ఈ గ్రామంలో మొత్తం 506 ఓట్లు ఉండగా, ఎనిమిది వార్డులు ఉన్నాయి. మొత్తం నలుగురు నామినేషన్లు వేయగా, ప్రధానంగా పోటీ మాత్రం తల్లీకూతుళ్ల మధ్యే నెలకొంది. దీంతో సర్పంచ్ పదవికి వీరిద్దరూ నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది.