యూనివర్సీటి ఇస్త కనీ.. నన్ను తలొదిక్కు గుంజకుండ్రీ..
Chief Minister Revanth Reddy’s visit to Adilabad district: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) పర్యటన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన జిల్లాలో రూ. 500 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడ చదువు ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ నేను యూనివర్సిటీ ఇస్తకనీ… నన్ను తలొ దిక్కు గుంజకుండ్రీ అంటూ నవ్వారు.. యూనివర్సిటీ ఇస్తే మా శంకర్ ఆదిలాబాద్ అంటడు.. మా బొజ్జు ఖానాపూర్ అంటడు.. మా ప్రేంసాగర్ రావు మంచిర్యాల అంటడు.. మా వివేకన్న, వినోదన్న ఎక్కడంటరో తెల్వదు… జిల్లాకు ఇవ్వనీకి నాకు అభ్యంతరం లేదు.. నన్ను తలో ఓ దిక్కు గుంజితే కష్టమైతదంటూ స్పషం చేశారు.
నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని ఉందంటూ ఆయన చెప్పారు. నా మనసుకైతే అలా అనిపిస్తోందంటూ వెల్లడించారు. అక్కడ నాగోబా జాతర ఉంటుందని అందరూ అక్కడకు వస్తారు కాబట్టి, ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని చెప్పడానికి బాగుటుందన్నారు. పోరాట వీరుడు కొమురం భీమ్ పేరు పెట్టుకుంటే ఇంకా బాగుటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది నా సూచన మాత్రమేనంటూ చెప్పారు. అనుమతి ఇచ్చేది తానని, ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోవాల్సిది మీరేనంటూ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. ఆ పంచాయతీలో మాత్రం తనను లాగొద్దన్నారు.