ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
ACB Attack: ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి ఏసీబీ(ACB) వలలో చిక్కాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఇప్పించేందుకు రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని రూ . 5 వేలు ఇస్తానని చెప్పిన లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఎవరైనా అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు.