ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం అభివృద్ధి
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ స్పష్టం చేశారు. ఏసీపీ ప్రకాష్‌తో కలిసి కాసిపేట, దండేపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడులు, బెదిరింపులు లేకుండా మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. గ్రామాల్లో ఎవరికైనా ఎన్నికల ప్రచారం చేయడానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు.
శాంతియుత వాతావరణంలో పారదర్శక ఎన్నికల కోసం తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, భద్రత, సరైన బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందేది ఓటు హక్కుతోనే అందరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తైహిసినోనుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.