కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఊరూరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. హామీలు సక్రమంగా అమలు చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఆయనను నిలదీశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను నిలదీశారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వారు ఎంతకీ తగ్గకపోవడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రచారం మధ్యలో నిలిపివేసి వెళ్లిపోయారు.