నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఓ వ్యక్తి నడిరోడ్డు పై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
బెల్లంపల్లి పట్టణంలోని బూడిద గడ్డ బస్తికి చెందిన కోడి శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. శనివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కాంటా చౌరస్తా వద్ద ఉన్న హార్డింగ్ కి ఉరి వేసుకుని మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు…