పూరీలు చేసిన సీఎం

CM Revanth Reddy:రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆదర్శ పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు.

ముఖ్య‌మంత్రి వంట గది పరిశీలిస్తున్న సంద‌ర్భంలో . వంటవారితో మాట్లాడుతూ కాసేపు స‌ర‌దాగా పూరీలు చేశారు. తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు సౌకర్యాలు కల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీషులో బోధిస్తారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సలహాదారులు కె. కేశవ రావు, శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

You might also like