బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

ఆషాఢ కృష్ణపక్ష చతుర్దశి, మాస శివరాత్రి, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర ఒకే రోజు కలిసి రావడంతో తాండూరు మండలంలోని కన్నాల పంచాయతీ పరిధిలోని బుగ్గ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన బుగ్గ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వయంభువుగా వెలిసిన పవిత్ర గంగాజలాన్ని తలపై చల్లుకుని అనంతరం స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కొందరిని నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలోకి అనుమతించడంతో సాధారణ భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like