హత్య చేసి… తల మొండం వేరు చేశారు..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశారు. తల మొండెం వేరు చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరు..? హత్య ఎవరు చేశారు..? ఎందుకు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.