వట్టి వాగు ప్రాజెక్టు నీటి విడుదల

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వట్టి వాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమై రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

దిగువ ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉన్నందున, అవసరాన్ని బట్టి అదనపు గేట్లను కూడా ఎత్తే అవకాశముందని అధికారులు తెలిపారు.

You might also like