తెలంగాణలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ..

7,437 పోస్టులకు నోటిఫికేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. ఈ మేరకు పోలీస్​శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, పైర్, జైళ్లశాఖలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీసు నియామక మండలి తెలిపింది. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వివరాలకు tgprb.in వెబ్‌సైట్​ను సంప్రదించాలని నియామక మండలి తెలిపింది.

ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలంటే…
ఎస్​ఐ(సివిల్) – 148
ఎస్​ఐ(ఏఆర్)-14
టీజీఎస్‌పీ ఎస్‌ఐ – 12
ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ ఎస్‌ఐ -3
ఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) – 23 పోస్టులు

కానిస్టేబుల్​ ఉద్యోగ వివరాలు…
కానిస్టేబుల్‌ (సివిల్‌) – 3,697
కానిస్టేబుల్ ఏఆర్‌ -1052
పీటీవో కానిస్టేబుల్ – 20
కానిస్టేబుల్ మెకానిక్‌ -7
స్పెషల్ పోలీస్‌ (ఎస్‌ఐ) -44
కానిస్టేబుల్ -1,038

ఫైర్ విభాగంలో ఉద్యోగాలు..
స్టేషన్ ఫైర్ ఆఫీసర్ -39,
ఫైర్ ఫైటర్ – 751 పోస్టులు
డిప్యూటీ జైలర్ (మెన్‌) – 14
డిప్యూటీ జైలర్ (మహిళ) – ఒక పోస్టు
వార్డర్ (మేల్) – 196
వార్డర్ (మహిళ) – 12 పోస్టులు భర్తీ

త్వరలో అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలను పోలీసు నియామక మండలి వెల్లడించనుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, అర్హతలు నిర్ధారించుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

You might also like