మెడికల్ కార్డు దరఖాస్తు చివరి తేదీ ఇదే…
సింగరేణి దిగిపోయిన కార్మికులు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మెడికల్ కార్డు దరఖాస్తుకు మార్చి 22 వరకు చివరి అవకాశం ఉందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు పదవి విరమణ పొందిన అన్ ఫిట్ అయిన కార్మికులు వైద్య చికిత్సల కోసం తీసుకునే మెడికల్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 22వ తేదీ వరకు అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్డుకు సంబంధించి రూ. 40,000 చెల్లిస్తే 8 లక్షల వరకు వైద్య సాయం అందుతుందన్నారు. ఐదు రకాల దీర్ఘ కాలిక రోగాలకు అపరిమిత వైద్య సదుపయాలు అందిస్తారని చెప్పారు. 10వ వేజ్ బోర్డ్ కన్నా ముందు 40,000/- కన్నా తక్కువ చెల్లించి 5,00,000 మేర మాత్రమే లబ్ది పొందుతున్న వారు, మిగతా రూపాయలు చెల్లించి 8 లక్షల వరకు వైద్య సదుపాయాలు పొందాలని కోరారు. ఇది చివరి అవకాశం అని అందరూ దీనిని సద్వినయోగం చేసుకోవాలన్నారు.