పోలీసుల రెయిన్ డాన్స్… సీపీ సీరియస్
శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీసులు చిందేశారు.. స్టేషన్లో విధులు నిర్వహించాల్సిన వారు ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో విందు వినోదాల్లో మునిగితేలారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు… వివరాల్లోకి వెళితే…
బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది ఉన్నతాధికారుల అనుమతి గానీ, కనీసం స్టేషన్ రికార్డుల్లో మూవ్మెంట్ ఎంట్రీ గానీ లేకుండా పట్టణ పరిధి దాటి తాండూరు మండలం కత్తెర్ల వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌కు (Mango Resort) వెళ్లారు. రెయిన్ డ్యాన్స్‌లు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడారు. ఈ వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వ్యవహారం కాస్తా పోలీస్‌బాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఫైర్ అయ్యారు. దీనిపై రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా విచారణ కు ఆదేశించారు. 12 మంది బర్త్ డే పార్టీకి వెళ్లినట్టుగా గుర్తించారు. ఇంకా ఎవ్వరు వెళ్ళారు….? దానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా..? వాళ్లు ఆన్ డ్యూటీలోనే వెళ్లారా..? అందులో సెలవు ఎవ్వరైనా తీసుకున్నారా..? అనే విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు.