మహేష్ బాబు సోదురుడు రమేష్ కన్నుమూత
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు(56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి సమస్యలతో ఆయన పోరాడి ఓడిపోయారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైధ్యులు తెలిపారు.ఈ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.