అమెరికాలో మంచు తుఫాను..
వాషింగ్టన్: అమెరికాలో మంచు తుఫాన్ వణికిస్తోంది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది. మాన్ హాటన్కు సమీపంలోని లాంగ్ ఐలాండ్లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు. హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మంచు తుఫాన్ ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్టు విమానయాన సంస్థలు ప్రకటించాయి. మంచు తుఫాన్ మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.