సింగరేణి కార్మికులకు ద్రోహం
టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు తీరని ద్రోహం చేస్తోందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు దుయ్యబట్టారు. బెల్లంపల్లి ఏరియా అబ్బాపూర్ ఓపెన్ కాస్ట్,ఖైరిగూడ,గోలేటి సిహెచ్ పి, ఏరియా వర్క్ షాప్ లో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణి బొగ్గు గని కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. సింగరేణి కార్మికుల ఆదాయపన్ను పరిమితి పెంచకపోవడం సిగ్గుచేటన్నారు. బొగ్గు బ్లాకుల వేలం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ రావు, ఫిట్ కార్యదర్శి ఇ లక్ష్మయ్య, గంగిశెట్టి శ్రీనివాస్, వర్క్ మెన్ ఇన్ స్పెక్టర్ సజ్జనపు శ్రీనివాస్, శ్యామ్ సుందర్ , శ్రీనివాస్ , గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.