కేంద్రం తన వైఖరి మార్చుకోవాలి
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంతకాల సేకరణలో భాగంగా బెల్లంపల్లి ఏరియా ఏరియా వర్క్ షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపెడుతోందన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి కేటాయించే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయించాలని కోరారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్కు, తెలంగాణ కు కేంద్రం వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఈ వ్యతిరేక వైఖరి విడనాడాలన్నారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ , చంద్రశేఖర్, మారిన వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ కార్యదర్శులు వెంకటేష్, చంద్రయ్య, మల్లేష్, సంపత్, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, నర్సింగరావు, రాజన్న, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.