పరువు పాయే.. పైసా పాయే…
-మాట జారిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-పాకిస్థాన్ మీద 55 మిలియన్ల డాలర్ల జరిమానా విధించిన అమెరికా
కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు… కానీ నోరు జారితే తీసుకోలేమని పెద్దలు ఊరికే చెప్పలేదు.. ఎక్కడైనా మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. పాక్ ప్రధాని విషయంలో అక్షరాలా అదే జరిగింది.
రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఉదయం 5 గంటలకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ మాస్కో చేరుకున్నాడు. అప్పటికే పుతిన్ రష్యా ప్రజలని ఉద్దేశించి జాతీయ టెలివిజన్ లో ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. ఉదయం 6.30 కి తన సైన్యానికి ఉక్రెయిన్ మీద దాడి చేయమని ఆదేశాలు ఇచ్చాడు.
ఇమ్రాన్ ఖాన్ మాస్కో లో ఉండగానే పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి చేయమని ఇచ్చిన ఆదేశాలని విని ఇమ్రాన్ ఖాన్ ‘నేను చాలా ఉద్వేగానికి గురి అవుతున్నా‘ అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించాడు.
ఇది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు కోపం తెప్పించింది. యుద్ధం చూసి ఎక్సైట్ అవడం ఏమిటీ..? అంటూ మండి పడ్డాడు. ఏవన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే వెంటనే అమలు చేయమని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ని సంప్రదించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అన్న రీతిన ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ అధికారులు పాకిస్తాన్ నేషనల్ బ్యాంక్ ఖాతాలని జల్లెడ పట్టారు. కొన్ని నిధులు పాకిస్థాన్ నేషనల్ బాంక్ నుండి పక్క దారి పట్టినట్లు గమనించారు. వెంటనే విషయం జో బిడెన్ కి తెలిపారు.
యాంటీ మనీ లాండరింగ్ చట్టం కింద తగిన నిబంధనలు పాటించలేదంటూ పాకిస్థాన్ నేషనల్ బ్యాంక్ మీద $55 మిలియన్ డాలర్లు జరిమానా విధించారు.. అంటే అమెరికాలో ఉన్న పాకిస్తాన్ నేషనల్ బాంక్ లో ఉన్న నిధుల లోనుండి జరిమానా మొత్తం ఆటోమాటిక్ గా బయటికి వెళ్ళిపోయాయి. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఉద్వేగానికి గురయ్యాను అంటూ జారిన ఒక్క మాట 55 మిలియన్ డాలర్లకి ఎసరు పెట్టినట్లయింది. అసలు యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో ఇమ్రాన్ మాస్కో వెళ్లి ఎం సాధిస్తాడు అంటూ ముందే పాకిస్థాన్ ప్రతిపక్షాలు ఎద్దేవా చేసాయి ఇమ్రాన్ ని . మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం పుతిన్ మోడీ ని కాదని పాకిస్తాన్ కి సహాయం చేయడు అంటూ ప్రతిపక్షాలు ముందే అపశకునాలు పలికాయి. చివరికి అదే జరిగింది.