ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి
ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారులు మరణించారు. నర్స్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే చిన్నారులు మరణించారని మృతుల తరఫున బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నారులను హాస్పిటల్ కి తీసుకొచ్చే సమయానికి వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ నర్స్ ఇచ్చిన ఇంజక్షన్ వల్లే పిల్లలు మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందితో మృతుల కుటుంబసభ్యులు వాగ్వావాదానికి దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకొంది.