రక్షణ తర్వాతే ఉత్పత్తి..
మంచిర్యాల : అండ్రియాల లాంగ్వాల్లో ప్రమాదంలో ఉన్న ముగ్గురిని చాకచక్యంగా కాపాడిన సింగరేణి రెస్క్యూ టీంకు సంబంధించి కే.కే 1 ఉద్యోగులు సంపత్, మనోహర్, క్రాంతిని ఈరోజు కేకే 1 గనిపై సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెస్క్యూ టీం చేసిన సేవలు అందరు గుర్తుపెట్టుకోవాలన్నారు. కేకే 1 కి సంబంధించిన యువకులు రెస్క్యూ టీంలో జాయిన్ కావాలన్నారు. ఈ సందర్భంగా కేకే 1 మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మన కేకే 1 గని మందమర్రి ఏరియాలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి తీసుకురావాలని, అధికారులు సీనియర్ కార్మికులు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదెలు, కేకే గ్రూప్ ఏజెంటు రాంచందర్ , వెల్ఫేర్ ఆఫీసర్ సంఘమిత్ర, సేఫ్టీ ఆఫీసర్ రమేష్, సర్వే ఆఫీసర్ తిరుపతి, సీనియర్ అండర్ మేనేజర్ కృష్ణ ప్రసాద్,సిద్ధార్థ, సూపర్వైజర్లు గురుమూర్తి,సాయికిరణ్,కృష్ణమాచారి,ఏ.రాజు,రాజేశం,గిరీష్,కేకే వన్ ఫిట్ సెక్రెటరీ బిల్లా మాధవ రెడ్డి, టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ,బడి కల సంపత్ , జే.రవీందర్, ఓ .రాజశేఖర్, శంకర్రావు, పీ.రాజిరెడ్డి ,ఈశ్వర్, పోలుసంపత్, మల్లేష్ అంబాల రాజేశం పాల్గొన్నారు