ప్రాణం తీసిన వాట్సప్ స్టేటస్..
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీనికి వాట్సప్ స్టేటస్ కారణమని సమాచారం. కొమ్ముగూడెం కు చెందిన యువతి హైదరాబాదులో పాలిటెక్నిక్ చదువుతోంది. ఉగాది పండక్కి సొంత ఊరికి వచ్చి ఊరిలోనే ఉంటోంది. స్థానిక యువకుడు అజయ్ యువతితో తీసుకున్న ఫోటో వాట్సప్ లో స్టేటస్ పెట్టాడు. ఫోటో తొలగించమని యువతి అడిగినా తొలగించక పోవడంతో మనస్థాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.