బ్రేకింగ్.. చెట్టు పై రెండు శవాలు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం నజిరాబాద్ శివారులో చెట్టుపై రెండు శవాలు గుర్తించారు. లోకేశ్వరం మండలం కన్కాపూర్ చెందిన బరిడే వినేశ్, ఆయన కుమారుడు అభిరామ్గా నిర్ధారించిన పోలీసులు. ఈ నెల 20న కుబీర్ మండలం సావ్లి గ్రామం అత్త గారి ఇంటి నుండి తన కొడుకు అభిరామ్ (4)ను కిరాణషాప్ కు తీసుకెళ్తానని చెప్పి బైక్ పై వెళ్లిన వినేష్. ఆ రోజు నుంచి తండ్రీ కొడుకుల అదృశ్యం.. నర్సాపూర్ మండలం కుస్లి గ్రామం వద్ద ఓ చెట్టుకు శవాలు. గ్రామస్తుల సమాచారంతో శవాలు వినేశ్ అభిరామ్ గా గుర్తించిన పోలీసులు. కొడుకుకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.