తృటిలో తప్పిన ప్రమాదం
సింగరేణి అధికారులు క్వార్టర్ల మరమత్తులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది.
షిర్కే లోని క్వార్టర్ D 892 నుంచి 15 కిలోల బరువైన పై పెచ్చు ఊడి D 888 క్వార్టర్లలో పడింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రమాద సమయంలో ఎవరైనా ఉండి ఉంటే దారుణం జరిగేది. శిథిలావస్థకు వచ్చిన క్వార్టర్ నుంచి పై పెచ్చులు ఇలా ఊడి పడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని INTUC ఏరియా సెక్రెటరీ సమ్ము రాజయ్య డిమాండ్ చేశారు.