ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఉరుముల తో కూడిన వర్షం పడుతోంది. బోథ్ మండలం లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. బేల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కు తోడు పిడుగుపాటు ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. కొబ్బాయి లో ఠాక్రే గజానన్ ఇంటి బయట కట్టెల కుప్ప (మండే)పై పిడుగు పడి, మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన గ్రామస్తులు మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది.కొమురం భీం జిల్లా లింగాపూర్ లో 51 మీమీ, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో 40.3 మీమీ వర్షపాతం నమోదు అయింది.