కనువిందు చేస్తున్న జలపాతాలు
అడవుల అందానికి కొదవే లేదు. అలాంటి అడవుల్లో జాలు వారే జలపాతాలు ఉంటే ఆ అందం వర్ణించడానికి కూడా తనివి తీరదు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అలాంటి వాటికి కొదవే లేదు. జిల్లావ్యాప్తంగా చాలా జలపాతాలు రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. తొలకరి పలకరింపు నేపథ్యంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అలాంటి జలపాతాలు ఎన్నో ఉన్నాయి. తిర్యాణి మండలం చింతలమాదర జలపాతం రెండు రోజులు పడిన వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. తిర్యాణికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఇక దట్టమైన అరణ్యంలో ఉన్న గుండాల జతపాతం కూడా కొండలపై నుంచి దూకుతూ కనువిందు చేస్తోంది.