మంత్రి చెప్పినట్టే.. ఖాళీ బీరు బాటిళ్లు జమ చేశారు
తమ గ్రామ పంచాయతీ ఆదాయం పెంచేందుకు యువకులు కొత్త మార్గం ఎంచుకున్నారు. మంత్రి చెప్పిన మార్గంలోనే నడవాలని నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ పంచాయతీకి గ్రామంలోని యువకులు ఖాళీ బీరు సీసాలు సేకరించి ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి మహేష్ కు ఖాళీ బీరు సీసాలు అందజేశారు ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖాళీ బీరు సీసాలతో ఆదాయం సమకూర్చుకోవచ్చు నని కామెంట్స్ చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి సూచనల మేరకు ఖాళీ బీరు సీసాలు సేకరించే కార్యక్రమం మొదలు పెట్టామని స్థానిక యువకులు వెల్లడించారు. ఖాళీ సీసాలు అమ్మి ఆదాయం సమకూర్చాలని పంచాయతీ కార్యదర్శికి అందజేశామని తెలిపారు.