ఆదివాసీలపై ఇంత అమానుషమా..?
-తెలంగాణ సర్కార్ ప్రజలకు ద్రోహం చేసింది
-స్పందించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ
ఆదివాసీలపై తెలంగాణ సర్కారు అమానుషంగా ప్రవర్తించిందని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆదివాసీలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాడికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన ట్వీట్ పై రాహుల్ స్పందించారు. ఆదివాసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. టిఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ద్రోహం చేసిందని విమర్శించారు. పోడు పట్టాలను అర్హులైన రైతులకు ఇస్తామని కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గిందన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న గిరిజన మహిళలను అమానుషంగా అణిచివేయడంపై మండిపడ్డారు. ఆదివాసీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని సీరియస్ అయ్యారు. పోలీసు వ్యవస్థను టిఆర్ఎస్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు.