85 శాతం అధిక వర్షపాతం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై చరిత్రలోనే గతంలో ఎప్పుడు లేనంత వర్షం కురిసింది. జూలై 10వరకు తెలంగాణలో కురవాల్సిన దానికంటే 85 శాతం అధిక వర్షం కురిసింది. ఐఎండీ అంచనా ప్రకారం జూలై 10వరకు తెలంగాణలో సరాసరి వర్షపాతం 19.7 సెంటిమీటర్లు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 36.6 సెంటిమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 జిల్లాలకు ఇవాళ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. తెలంగాణాలో వర్షపాతం ఇలానే నమోదయితే రానున్న 24 గంటల్లో పలు జిల్లాలో వరదలు సంభంవించే అవకాశం ఉందని తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో వరద ప్రమాదం ఉంటుందని అంచనా వేసింది.

అన్ని జిల్లాల్లోనూ కురవాల్సిన దానికంటే ఎక్కువ వర్షమే కురిసింది. మహబూబా బాద్ జిల్లాలో ఏకంగా 126 శాతం అధిక వర్షం కురవగా.. భూపాలపల్లి జిల్లాలో 122 శాతం అధిక వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం జిల్లాలో కురవాల్సిన దాని కంటే డబుల్ వర్షం కురిసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు వంద శాతం అధిక వర్షం కురిసింది. మిగితా జిల్లాల్లోనూ కురవాల్సిన దాని కంటే 50 నుంచి 90 శాతం వరకు ఎక్కువ వర్షం కురిసింది. హైదరాబాద్ జిల్లాలో ఈపాటికి కురవాల్సిన వర్షం కుంటే 41 శాతం అధిక వర్షం కురిసింది.

జిల్లా అధికం (ఎంత శాతం)
ఆదిలాబాద్ 51
ఆసిఫాబాద్‌ 93
మంచిర్యాల 87
నిర్మ‌ల్ 91
నిజామాబాద్‌ 118
జగిత్యాల 93
పెద్ద‌ప‌ల్లి 75
జయశంకర్ 112
భద్రాద్రి కొత్తగూడెం 102
మ‌హ‌బూబాబాద్‌ 126
వరంగల్ 74
హన్మకొండ 68
క‌రీంన‌గ‌ర్ 103
రాజన్న సిరిసిల్ల 67
కామారెడ్డి 103
సంగారెడ్డి 66
మెద‌క్‌ 57
సిద్దిపేట 73
జ‌నగామ 87
యాదాద్రి భువనగిరి 73
మేడ్చ‌ల్‌ 79
హైదరాబాద్ 41
రంగారెడ్డి 79
వికారాబాద్‌ 54
మహబూబ్ నగర్ 98
జోగులాంబ గ‌ద్వాల‌ 50
వనపర్తి 83
నాగర్ కర్నూల్ 97
నల్లగొండ 87
సూర్యాపేట 96
ఖమ్మం 94
ములుగు 97
నారాయణపేట 69

Get real time updates directly on you device, subscribe now.

You might also like