కొట్టుకుపోయిన లో లెవల్ కాజ్వే..
-పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
-అప్రమత్తమైన అధికారులు
మంచిర్యాల : భారీగా కురుస్తున్న వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. వేమనపల్లి, నాగరం మధ్య రోడ్డు దెబ్బతింది. వేమనపల్లి మత్తడి వాగు ఉధృతికి సుంపుటం వెళ్ళే దారిలో ఉన్న లోలెవల్ కాజ్ వే కొట్టుకుపోయిన దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం, ఆదివారం ఈ కాజ్వే పై నుంచి పెద్ద ఎత్తున వరద ప్రహహం పోటెత్తింది. దీంతో ఆ కాజ్ వే కొట్టుకుపోయింది. దీంతో వేమనపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు మత్తడివాగు పరిశీలించారు. ప్రజలు ఎవరూ కూడా వాగుల వద్దకు పోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పంచాయతీ కార్యదర్శిని హెడ్ క్వార్టర్ లొనే ఉండాలని చెప్పారు.