జలదిగ్బంధంలో ఐనం
-ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫోన్
-ధైర్యంగా ఉండాలని సూచన
-సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భరోసా
-రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కి విజ్ఞప్తి
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దహెగాం మండలంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతాలైన ఐనం జలదిగ్భందలో చిక్కుకుపోయింది. ఐనంతో పాటు బీబ్రా పెసరికుంట ఇట్యాల గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. గ్రామస్తులు ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధైర్యంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి ఫోన్ చేసి సమస్య వివరించారు. రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా బెజ్జూర్ మండలంలో సైతం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.