ఫ్లాష్.. ఫ్లాష్.. ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం..
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసర వస్తువులు అందించి వస్తుండగా, తృటిలో ఈ ప్రమాదం తప్పింది. నాలుగు రోజులుగా సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే శనివారం ఆమె ఏటూరు నాగారం మండలం ఎనిశెట్టిపెల్లి వాగు దాటి వరద బాధితులను పరామర్శించారు. వారికి నిత్యావసరాలు అందజేశారు.
తిరిగి వస్తుండగా వాగు మధ్యలో పడవలో పెట్రోల్ అయిపోయింది. అయితే వాగు ఉధృతికి పడవ ఓ వైపునకు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఆ పడవ ఒడ్డుకు సమీపంలోని చెట్టు వద్దకు చేరింది. సీతక్కతో పాటు పడవలో ఉన్నవారు ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పడవ సడెన్‌గా ఆగిపోవడంతో అక్కడంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.