వీఆర్ఏలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
వీఆర్ఏలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వీఆర్ఏ JAC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. జైపూర్, బీమారం, చెన్నూరు మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద వీఆర్ఏల ఆందోళలనకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు ఉద్యోగులు అయినా, ఈ పాలనలో వారికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ పెంచుతూ, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయ సమ్మతమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. వీఆర్ఏలు చేస్తున్న న్యాయపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు చెబుతున్నామని అన్నారు.