కూలిన మిగ్ 21బైసన్ : ఇద్దరు పైలెట్లు మృతి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కి చెందిన మిగ్-21 బైసన్ విమానం రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా భీమ్రా (భీమ్డా) గ్రామంలో కూలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఫైటర్ జెట్‌లోని పైలట్లిద్దరూ ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ లోకబంధు యాదవ్ ధృవీకరించారు.
అయితే, ప్రమాదానికి సంబంధించి IAF నుండి ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. విమానం క్రాష్ అయిన తర్వాత మంటలు వెలువడుతున్నట్లు కనపడ్డాయి. దాదాపు అరకిలోమీటర్ వరకు విమాన శకలాలు పడ్డాయని స్థానికులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పైలట్‌లలో ఒకరి శరీరం పూర్తిగా కాలిపోగా, మరొకరి శరీరం తీవ్రంగా దెబ్బతింది.
ఘటనపై నివేదిక అందుకున్న బార్మర్ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.