పెండ్లి కొడుకు ప్ర‌యాణిస్తున్న కారు ద‌గ్దం

పెండ్లి కొడుకు ప్ర‌యాణిస్తున్న కారులో మంట‌లు చెల‌రేగ‌డంతో ఆ కారు మొత్తం ద‌గ్ధ‌మైంది. మంచిర్యాల జిల్లా మందమ‌ర్రి మండ‌లం మేడారం వ‌ద్ద ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. వివ‌రాల్లోకి వెళితే.. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో వివాహం ఉండ‌టంతో కాగజ్ నగర్ పట్టణానికి చెందిన జాడి రాజేష్ కుటుంబ సభ్యులతో ఆల్టో 800 కారులో బ‌య‌ల్దేరాడు. సాయంత్రం 7.45 గంటల సమయంలో మంద‌మ‌ర్రి మండ‌లం మేడారం ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి కారు నుండి మంటలు లేచాయి. దానిని గ‌మ‌నించి కారును ప‌క్క‌నే నిలిపివేశారు. పెండ్లి కొడుకుతో స‌హా అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. కారులో ఉన్న న‌లుగురు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అర్పివేసింది. ఈ ఘ‌ట‌న‌లో కారు ద‌గ్ధ‌మైంది.

You might also like