పారిశుద్ధ్య సిబ్బందిని ఢీకొట్టిన లారీ
-మంచిర్యాలలో ఘటన.. ఇద్దరికి గాయాలు
-పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య
రోడ్డుపై పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల మున్సిపల్స్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఆత్మకూరు లస్మయ్య, చెన్న మల్లేష్ ఉదయం ఐబీ ఏరియాలో రోడ్డుపక్కన విధులు నిర్వహిస్తున్నారు. ఐబీ సమీపంలో వారిని లారీ ఢీకొట్టింది. దీంతో వారికి గాయాలు అయ్యాయి. వెంటనే వారిని మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కార్మికులను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పరామర్శించారు. వారిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో పాటు పట్టణ కౌన్సిలర్లు హరికృష్ణ, పోరెడ్డి రాజు, మున్సిపల్ జవాన్లు, కార్మికులు ఉన్నారు.