రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి
రాజీవ్ గాంధీ గొప్ప సంస్కరణ వేత్త అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి అన్నారు. గుంటూరులో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ రోజు దేశంలో టెక్నాలజీలో పెద్ద ఎత్తున సాంకేతిక విప్లవం వచ్చిందంటే రాజీవ్ గాంధీ వేసిన బాటనే అని తెలిపారు. ఎన్నికల్లో, పరిపాలనలో యువత భాగస్వామ్యం ఉండాలని 18 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పించిన దూర దృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు నాయకత్వం కల్పించి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు ఆయన అని వెల్లడించారు. దేశాన్ని ముందుచూపుతో నడిపినటువంటి రాజీవ్ గాంధని భారత దేశం మర్చిపోదన్నారు.