జాతీయ రహదారిపై కుంగిన అప్రోచ్ రోడ్డు
రాకపోకలు నిషేధించిన అధికారులు
Crooked approach road on National Highway: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి సమీపంలో అప్రోచ్ రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్ పట్టణ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బతుకమ్మ వాగు దగ్గర రోడ్డు కుంగింది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా గుంత ఏర్పడింది. చింతలపల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో చెన్నూరు తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్‌పాండే, చెన్నూరు టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. కాళేశ్వరం, సిర్వంచ వెళ్లే ప్రయాణీకులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.