అదనపు కలెక్టర్ వాహనం అడ్డగింత
Additional collector vehicle interceptor: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. కాగజ్ నగర్ మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విచారణ జరిపేందుకు వచ్చిన అదనపు కలెక్టర్ పాఠశాలలో విచారణ నిర్వహించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తిరిగి వెళ్తుండగా, అదనపు కలెక్టర్ ను కలెక్టర్ వాహనాన్ని విద్యార్థి సంఘాలు,విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగి వచ్చిన అదనపు కలెక్టర్ వారితో మాట్లాడారు. పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక అందిస్తామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.