కేటీఆర్ పర్యటన.. బీజేపీ నేతల ఆందోళన
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఐఐఐటి వద్ద ఒక్కస్గారిగా టీఆరెఎస్ డౌన్ డౌన్ అంటూ నినాడాలు చేస్తూ కళాశాల ముట్టడికి ప్రయతించారు. మరో వైపు కళాశాల ప్రాంగణం వద్ద ఉన్న టీఅర్ఎస్ నాయకులు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. దీనితో ఒక సరిగా అలజడి చోటు చేసుకుంది. నిరసనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ తరలించారు.
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులు ఐఐఐటీని దిగ్బంధించారు. ఉదయం నుండి పలువురు ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు.