కాంగ్రెసులోకి సోహైల్ ఖాన్
Sohail Khan to join Congress: తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత సోహైల్ ఖాన్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ని కలిశారు. 2002లో టీఅర్ఎస్ జాయిన్ అయ్యారు. 2010లో మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకి కూడా వెళ్లారు.
పార్టీలో తనకు సరైన న్యాయం జరగడం లేదని తాను ఎమ్యెల్యే నడిపల్లి దివాకర్ రావ్ దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఈ నెల15న కాంగ్రెస్ పార్టీలో, పలువురు టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఆయన నాందిన్యూస్ కు వెల్లడించారు.