ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బుగ్గ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 30 జంటలు ఈ సత్యనారాయణ స్వామి వత్రంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా ఎంతో ఫలితం లభిస్తుందన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలని వాటిని దర్శిస్తే పుణ్యఫలంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు బండ్లపల్లిగోపి, జీలపల్లి వెంకటస్వామి, అభినవ సంతోష్, కన్నాల సర్పంచ్ జీలపల్లి స్వరూప, ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో తాటిపాక సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.