అధికారి బదిలీ: ఉద్యోగుల సంబురాలు
Officer Transfer: Employee Happiness: తమ పై అధికారి బదిలీ అయితే సిబ్బంది కన్నీరు పెట్టడం లేదా బాధపడటం చూస్తాం.. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయ్యింది. తమ పై అధికారి ట్రాన్స్ఫర్ అయితే కింద స్థాయి సిబ్బంది సంబురాలు చేసుకున్నారు.
ఆదిలాబాద్ విద్యుత్ శాఖలో ఒక అధికారి బదిలీతో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఇక్కడ ఎస్ఈగా కొనసాగిన ఉత్తం జాడేను డిచ్పల్లి డీఈగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తం జాడే కు ఎస్ఈగా ఇచ్చిన ప్రమోషన్ రద్దు చేస్తూ డీఈ గా డిచ్పల్లికి పంపించారు. దీంతో ఇక్కడ సిబ్బంది కార్యలయం ఆవరణలో టపాసులు పేల్చి డప్పుల చప్పుళ్ళతో సంబురాలు జరుపుకున్నారు. కిందస్థాయి సిబ్బందిని వేదించడంతోపాటు మీటర్ల అక్రమాల్లో కావాలని కొంతమందిని ఇరికించారనే ఆరోపణలు ఉత్తం జాడేపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వేధింపులకు గురైన సిబ్బంది కార్యాలయ ఆవరణలోనే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశం అయింది.